Jr Ntr | యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా దేవర చిత్ర ప్రమోషన్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జపాన్లో మూవీ మార్చి 28న విడుదల కాగా, ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లారు. అక్కడ పలు ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగచైతన్య రెస్టారెంట్ గురించి ప్రస్తావించారు తారక్. ‘దేవర’ జపాన్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా యాంకర్.. జపనీయుల కోసం హైదరాబాద్ లో ఉన్న మీ ఫేవరేట్ రెస్టారెంట్స్ గురించి చెప్పమని అడగ్గా, తారక్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
హైదరాబాద్ ఫుడ్ కల్చర్ లో ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంటెర్నేషనల్ ఫుడ్ దొరుకుతుంది. బాంబే.,ఢిల్లీ తర్వాత ఇంటెర్నేషనల్ ఫుడ్ కి హైదరాబాద్ ఒక హబ్ గా మారిందని ఎన్టీఆర్ చెప్పారు. నేను సుషీ అనే జపనీస్ ఫుడ్ ని బాగా ఇష్టపడతాను అని చెప్పిన ఎన్టీఆర్.. సుషీ కోసం షోయు అనే రెస్టారెంట్ ను కూడా రికమెండ్ చేస్తాను అని అన్నారు. మై డియర్ ఫ్రెండ్, నా తోటి నటుడైన నాగచైతన్య దాని ఓనర్, అక్కడ బెస్ట్ జపనీస్ ఫుడ్ అక్కడ దొరుకుతుంది. ఫుడ్ అమేజింగ్ గా ఉంటుంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.
మరోవైపు ఎన్టీఆర్ హైదరాబాద్ బిర్యానికి సంబంధించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘హైదరాబాద్ లో హైద్రాబాదీ బిర్యానీకి మించింది లేదు. షాదాబ్ అనే ఓల్డెస్ట్ రెస్టారెంట్ లో మంచి బిర్యానీ అందుబాటులో ఉంటుంది. ట్రెడిషనల్ ఆంధ్రా ఫుడ్ కోసమైతే స్పైస్ వెన్యూ, కాకతీయ డీలక్స్ మెస్.. తెలంగాణ రుచుల కోసం తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్ రెస్టారెంట్స్ ను నేను రికమెండ్ చేస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్ బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ మంచి ఫుడీ అని అర్ధమవుతుంది. ఎన్టీఆర్ బిర్యానీ, హలీం చాలా బాగా వండుతాడని ఇటీవల ఆయన బావమరిది నార్నే నితిన్ కూడా చెప్పాడు. ఇక నాగా చైతన్య విషయానికి వస్తే కొన్నేళ్ల క్రితం ‘షోయూ’ పేరుతో క్లౌడ్ కిచెన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన అతను ఇప్పుడు ‘స్కూజీ’ పేరుతో మరో కొత్త ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇటీవలే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.