Devara | గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ప్రకటించిన ప్రకారం దావూదీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ పాటలో తారక్, జాన్వీకపూర్ పోటీపడి మరీ డ్యాన్స్ చేసినట్లు వీడియో సాంగ్ చెబుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన చుట్టమల్లె (Chuttamalle) మెలోడీ డ్యుయెట్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలుస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై తారక్, జాన్వీకపూర్ కాంబో మ్యాజిక్ చేయబోతున్నట్టు తాజా విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దావూదీ వీడియో సాంగ్..
How long has it been
since we’ve seen our @tarak9999 in this vintage vibe?https://t.co/0IGZvEFMiY #Daavudi is here for all the fans. #Devara— Devara (@DevaraMovie) September 4, 2024