Devara | ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పాపులర్ అయ్యాడు టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). తారక్ టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా పాన్ ఇండియా మూవీ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదలవుతుంది.
దేవర థర్డ్ సింగిల్దావుడి (Daavudi) త్వరలోనే లాంచ్ చేస్తున్నాం. ఈ మాస్ డ్యుయెట్ తారక్-జాన్వీకపూర్ (Janhvi Kapoor) మధ్య ఉండబోతుందని అనిరుధ్ రవిచందర్ ప్రకటించాడని తెలిసిందే. తాజాగా దావుడి సాంగ్ లుక్ రిలీజ్ చేస్తూ కొత్త వార్తను షేర్ చేసింది కొరటాల టీం. ప్రతీ ఒక్కరితో డ్యాన్స్ చేయించే బీట్స్‌తో దావుడి సాంగ్ సెప్టెంబర్ 4న రాబోతుందని ట్వీట్ చేశారు మేకర్స్. మరో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ పక్కా అని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా దేవర నుంచి విడుదల చేసిన ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. ఇటీవలే భయం ముఖ చిత్రాలు.. అంటూ కొంచెం నవ్వు.. మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తున్న తారక్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దేవరలో ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. దేవరతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.
The beats are set for an irresistible Dance Blaze 🕺🏻💃#Daavudi is the song that will make Everyone Move 💥
Video Song out on September 4th ❤️🔥
An @anirudhofficial Musical 🎶 #Devara #DevaraOnSep27thMan of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor… pic.twitter.com/VmHc7z5ciO
— NTR Arts (@NTRArtsOfficial) September 2, 2024
Devara | తారక్ దేవరకు అదిరిపోయే ఓపెనింగ్.. సెన్సేషనల్ ప్రీ సేల్స్ ఎక్కడో తెలుసా..?
Viswam | స్టైలిష్ లుక్‌లో గోపీచంద్.. విశ్వం టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
Billa Ranga Baasha | కిచ్చా సుదీప్ బిల్లా రంగా భాషా.. హనుమాన్ మేకర్స్ అనౌన్స్మెంట్ అదిరిందంతే..!