Davudi Song | సోషల్ మీడియాలో చిన్నారుల డ్యాన్స్ వీడియోలు తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కొన్ని వీడియోలు మాత్రం నెటిజన్లను కట్టిపడేస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. తారక్ నటించిన దేవర సినిమాలోని దావూది సాంగ్ (Davudi Song) ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట మిలియన్ల సంఖ్యలో వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే ఇదే పాటకు ఓ స్కూల్ ఈవెంట్లో ప్లే చేశారు.
చిన్నారులంతా కలిసి డ్యాన్స్ చేయగా.. అందులో ఉన్న ఓ బుడ్డోడు మాత్రం దావూది సాంగ్‌కు చాలా స్టైలిష్‌గా డ్యాన్స్ చేసి ఔరా అనిపిస్తున్నాడు. విద్యార్థులంతా దావూది స్టెప్పులేస్తుంటే అందులో ఉన్న ఓ చిన్నోడు.. మధ్యలో ఉన్న బుడ్డోడికి బ్లాక్ గాగుల్స్ ఇచ్చాడు. ఇంకేంటి ఆ గాగుల్స్ పెట్టాక మరింత చెలరేగిపోయాడు. ఈ వీడియో నెటిజన్లను కట్టిపడేస్తుంది.
ఇక ఈ వీడియో తారక్ కంటపడటంతో ఇంప్రెస్ అయ్యాడు. బుడ్డోడి డ్యాన్స్ చాలా ముద్దుగా ఉందంటూ రిప్లై ఇచ్చాడు తారక్. ఇప్పుడీ వీడియోతోపాటు తారక్ ఇచ్చిన రిప్లై నెట్టింట హల్ చల్ చేస్తోంది.
బుడ్డోడి దావూది డ్యాన్స్ చూశారా..?
Buddodu Chala Confined ga Dance chesthunnadu 🤩 #Devara pic.twitter.com/eIBQCJxP0H
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) January 11, 2025
NTR @tarak9999 comments on the reel which shows a bunch of kids dancing to Daavudi from #Devara pic.twitter.com/857BasDFGN
— …. (@ynakg2) January 13, 2025
Balakrishna | ఊర్వశి రౌతేలాతో బాలకృష్ణ స్టెప్పులు.. ముద్దులతో ముంచెత్తిన డాకు మహారాజ్.. Video
AjithKumar | దేశం గర్వించేలా.. దుబాయ్‌లో అజిత్‌కుమార్ టీం ఆనందకర క్షణాలు