కాసిపేట : క్రీడాకారులు క్రీడా స్పూర్తితో రాణించాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ఇనుకొండ ఈశ్వర్ సత్యసాయి దుర్గ మనోజ్ ( Sub-Collector Manoj ) సూచించారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి క్రీడా మైదానంలో మండల ప్రీమియర్ లీగ్ సీజనల్-4 క్రికెట్ టోర్నీ బుధవారం ముగిసింది.
ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ కాసిపేటపై, బ్రేవ్ హార్ట్ సోల్జర్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో బ్రేవ్ హార్ట్ సోల్జర్స్ విజయం సాధించింది. ఈ మేరకు విన్నర్ బ్రేవ్ హార్ట్ సోల్జర్స్ జట్టుకు రూ.75వేలు నగదుతో పాటు ట్రోపీని, రన్నర్ సన్ రైజర్స్ కాసిపేట జట్టుకు రూ.50వేలు నగదుతో పాటు ట్రోఫీలను ఆయన అందజేసి మాట్లాడారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, అందరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, గొంది వెంకటరమణ, వూటూరి సాయి కుమార్, అప్పాల శేఖర్, చింతల విద్యా సాగర్, ఇంగు నారాయణ, నస్పూరి నర్సింగ్, నిర్వాహకులు నామసాని రాజు, దాసరి శంకర్, కంటం తిరుపతి, మేరుగు శ్రీనివాస్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.