టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక అప్డేట్తో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు. ఈ స్టార్ హీరో ఇప్పటికే న్యూయార్క్‌లోని పాపులర్ జునూన్ రెస్టారెంట్ (Junoon)లో సందడి చేసిన స్టిల్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా తారక్ ఈ సారి న్యూయార్క్ వీధుల్లో షికారు చేశాడు. తారక్‌తోపాటు సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా సరదా సమయాన్ని ఆస్వాదించింది.
న్యూయార్క్‌లోని ఓ మెయిన్ రోడ్డుపై దిగిన ఫొటోను తారక్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతోంది. ఎన్టీఆర్ నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 (NTR 30) చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ టూర్ ను ఎంజాయ్ చేస్తున్న తారక్ త్వరలోనే మళ్లీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ తో బిజీ కానున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. కొరటాల-తారక్ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ మంచి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండో సినిమా రాబోతుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ 30 ఇంట్రడక్షన్ వీడియో ఒకటి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో తారక్ ఇదివరకెన్నడూ కనిపించని సరికొత్త లుక్‌లో మెరవబోతున్నాడు.
న్యూయార్క్ వీధుల్లో షికారు ఇలా..
NTR @tarak9999 on Instagram – Enjoying a New York minute pic.twitter.com/KpTqArukYy
— BA Raju's Team (@baraju_SuperHit) December 27, 2022
Read Also : Uravasi Rautela | చిరంజీవితో పనిచేస్తున్నానా అని షాకయ్యా : ఊర్వశి రౌటేలా
Read Also : Ranveer Singh | క్రేజీ టాక్.. రవితేజ సినిమాపై కన్నేసిన రణ్వీర్ సింగ్
Read Also : GV Prakash Kumar | సూరారై పోట్రు రీమేక్‌పై జీవీ ప్రకాశ్ కుమార్ అప్డేట్