ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) షూట్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు 60శాతం పూర్తయింది. ఈ సినిమాను తారక్ ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. కేవలం ఈ సినిమా కోసమే తన కెరీర్లో మునుపెన్నడూ లేనంతగా స్లిమ్ అయ్యారాయన. ప్రశాంత్ నీల్ కూడా తారక్‌ను కొత్తగా చూపించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. తారక్‌ని సరికొత్త అవతారంలో చూపించి, ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం.
ఇదిలావుంటే.. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కి సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి. ఈ నెల మూడో వారం నుంచి యూరప్‌లో తాజా షెడ్యూల్ మొదలుకానున్నది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మేకర్స్ పూర్తి చేశారట. ఈ షెడ్యూల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతోపాటు కథానాయిక రుక్మిణి వసంత్, ఎన్టీఆర్‌లపై రొమాంటిక్ సీన్స్ కూడా షూట్ చేస్తారట. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో విడుదల కానున్నది.