టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)-విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం జనగణమన (Jana Gana Mana). ఈ మూవీ మంగళవారం గ్రాండ్‌గా ముంబైలో మొదలైంది. ఛార్మీ, వంశీపైడి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో, జీజేఎం టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నితెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. లాంఛింగ్ తోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు పూరీ జగన్నాథ్.
ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ఈ చిత్రం ఆర్మీ, వార్ బ్యాక్ డ్రాప్లో ఉండబోతుందని క్లారిటీ ఇచ్చింది. సినిమా లాంఛింగ్ తర్వాత పూరీ, విజయ్ అండ్ టీం అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)ను కలిశారు పూరీ అండ్ టీం. అయితే ఇలా సడెన్‌గా రక్షణమంత్రిని రాజ్‌నాథ్‌తో సమావేశం కావడంపై సర్వత్రా క్యూరియాసిటీ నెలకొంది. సినిమాకు సంబంధించిన కొన్ని అంశాల వల్లే పూరీ అండ్ టీం ఇలా రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఉంటారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Team #JGM meets honourable Defence minister of India , Shri @rajnathsingh ji at Delhi Last evening !!@TheDeverakonda #PuriJagannadh @Charmmeofficial @PuriConnects #RamuRaoJupally#SrikaraStudios @IamVishuReddy pic.twitter.com/0XJDlEjlHH
— Charmme Kaur (@Charmmeofficial) March 31, 2022
ఆర్మీ, వార్ మూవీ కావడంతో కీలక విషయాలు ఏమైనా చర్చించడానికి వెళ్లారా..? అసలు ఈ సమావేశం వెనకున్న సీక్రెట్ ఏంటనేదానిపై పూరీ అండ్ టీంలో ఎవరైనా స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిజేఎం షూటింగ్ ఏప్రిల్ నుంచి షురూ కానుంది. 2023 ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకానుంది.