Fish Venkat | టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట్ అనారోగ్యంతో ఆస్పత్రితో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంకట్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే అతడి కిడ్నీలు మార్పిడి చేయకపోతే బతకడం కష్టమని వెద్యులు తెలిపినట్లు ఇప్పటికే వెల్లడించిన వెంకట్ కూతురు స్రవంతి .. ప్రస్తుతం తాము వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా తమకు సాయం చేయాలని కోరుతున్నారు.
ఈ మేరకు టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు తమ వంతుగా సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా జెట్టీ ఫేం కృష్ణ మానినేని తన ఉదారతను చాటుకున్నాడు. ఫిష్ వెంకట్ వైద్య ఖర్చులకు తన వంతు సాయంగా రూ.2 లక్షలు అందజేశాడు. కృష్ణ మానినేని 100 dreams foundation ద్వారా ఈ ఆర్థిక సాయాన్ని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతికి అందజేశాడు.
మా ఫౌండేషన్‌లో ఓ కార్యక్రమమైన పునరపి (అవయవ దాన అవగాహన) మా ఆశయం మాత్రమే కాదు.. అవసరంలో ఉన్నవారికి జీవితాన్ని ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఒక్క నిర్ణయం ఒక జీవితమని ఈ సందర్భంగా కృష్ణ మానినేని అన్నాడు. కృష్ణ మానినేని గతంలో ఏపీ వరదల సమయంలో వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలు అందజేశాడని తెలిసిందే.
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్