jersey movie postponed | కొద్దిరోజుల నుంచి సినిమాలు అనుకున్న సమయానికి విడుదల అవుతున్నాయి. వాయిదాలు లేకుండా చెప్పిన థియేటర్స్ లోకి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మళ్లీ వాయిదాల పర్వం మొదలైంది. బాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజియస్ సినిమాలలో ఒకటిగా నిలిచిన జెర్సీ సినిమా వాయిదా పడింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. తెలుగులో మంచి విజయం అందుకున్న నాని జెర్సీ సినిమాకు ఇది రీమేక్. దిల్ రాజు, అల్లు అరవింద్ సంయుక్తంగా జెర్సీ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 31న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఎప్పుడో ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా వస్తుండటంతో.. నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు థియేటర్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీకి కుదించింది ప్రభుత్వం.
ఇది ఖచ్చితంగా కొత్త సినిమాల కలెక్షన్స్‌పై భారీ ప్రభావం చూపించడం ఖాయం. అందుకోసమే జెర్సీ సినిమా కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇది కేవలం ఈ సినిమా వరకు మాత్రమే పరిమితం అవుతుందా.. లేదంటే రాబోయే సినిమాలకు కూడా ఇది ఆనవాయితీ కంటిన్యూ అవుతుందా అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే రాబోయే సినిమాలు అన్ని వందల కోట్ల బడ్జెట్‌తో వస్తున్నవే. జనవరి 7న ట్రిపుల్ ఆర్.. 14న రాధే శ్యామ్ విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సినిమాలు వాయిదా పడకుండా అనుకున్న సమయానికి వస్తాయా రావా అనేది అందరిలోనూ కన్ఫ్యూజన్ ఉంది. విడుదల తేదీపై వెనక్కి తగ్గేది లేదు అంటూ ఇప్పటికే పలుమార్లు కన్ఫమ్ చేశారు దర్శక నిర్మాతలు. కానీ పరిస్థితులు పగ పట్టినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు. జెర్సీతోనే ఈ వాయిదాల పర్వం ఆగిపోతే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్ప సినిమా కోసం సుకుమార్ ముందు అనుకున్నది అల్లు అర్జున్ను కాదంట
Allu Arjun Crying : సుకుమార్ లేకుంటే నేను లేను.. పుష్ప థ్యాంక్స్‌మీట్‌లో బన్నీ కన్నీళ్లు.. వీడియో
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..