Jayam Ravi | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ జయం రవి (Jayam Ravi). ఈ కోలీవుడ్ స్టార్ యాక్టర్ తన సతీమణి ఆర్తితో విడాకులు తీసుకుంటున్నాడంటూ కొంతకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తలు నిజమయ్యాయి. తన సతీమణితో 15 ఏండ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులను ప్రకటించాడు జయం రవి.
వ్యక్తిగల కారణాలు, కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కఠిన నిర్ణయం తీసుకున్నాం. ప్రతీ ఒక్కరూ మా ప్రైవసీని గౌరవిస్తారని విజ్ఞప్తి చేస్తున్నానని సోషల్ మీడియాలో ఓ సందేశాన్ని జయం రవి అందరితో పంచుకున్నాడు .
ప్రముఖ టెలివిజన్ ప్రొడ్యూసర్ అయిన సుజాత విజయ కుమార్ కూతురు ఆర్తి. జయం రవి-ఆర్తికి ఇద్దరు కుమారులు. జయం రవి చివరగా పొన్నియన్ సెల్వన్ 2తో సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. జయం రవి ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉన్నాయి.
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!
Maa Nanna Superhero | క్యూరియాసిటీ పెంచుతోన్న సుధీర్ బాబు.. మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ వైరల్
KA | కిరణ్ అబ్బవరం క టీంకు దుల్కర్ సల్మాన్ సపోర్ట్