Pretty Little Baby | ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ గురువారం తన 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యి ఆమెకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వేడుకలో షబానా అజ్మీ, ఆమె భర్త, ప్రముఖ కవి దిగ్గజ రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి హాలీవుడ్ ఐకానిక్ సాంగ్ అయిన ‘ప్రిట్టి లిటిల్ బేబీ'(Pretty Little Baby) పాటకు డ్యాన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. వీరిద్దరి కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, షబానా అజ్మీ మెరూన్ రంగు గౌనులో, జావేద్ అక్తర్ ఎరుపు రంగు కుర్తా, నల్ల రంగు నెహ్రూ జాకెట్లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఈ జంట కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా డ్యాన్స్ చేయడం ఈ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి. ఈ వేడుకలో రేఖ, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, ఊర్మిళా మటోండ్కర్ వంటి ఇతర తారలు కూడా తమ డ్యాన్స్‌తో అలరించారు.
#FarahKhan captures pure magic!😍 #JavedAkhtar and #ShabanaAzmi dancing together, showing us what timeless love looks like. 💖#Birthday #celebs pic.twitter.com/0qHlocWa9p
— Filmfare (@filmfare) September 18, 2025