కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘K-ర్యాంప్’. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్ నాని దర్శకుడు. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమా ఆన్ లొకేషన్ ఎంత ఫన్‌గా ఉందో ఈ వీడియో చెబుతున్నది. టీమ్ ఎంజాయ్ చేసిన ఇదే ఫన్ని థియేటర్లలో ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని మేకర్స్ చెబుతున్నారు. నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్.