Pahalgam Terror Attack | జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంగళవారం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యటకులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిని సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ స్పందించాడు.
పహల్గాం ఉగ్రదాడి వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నా హృదయం బాధతో నిండిపోయింది. ఏది ఏమైనా, ఎంత ఖర్చయినా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా సరే, పహల్గాం ఉగ్రవాదులు తప్పించుకోకూడదు. ఈ సామూహిక హంతకులు తమ మానవత్వం లేని చర్యలకు వారి ప్రాణాలతోనే మూల్యం చెల్లించాలంటూ జావేద్ ఎక్స్ వేదికగా రాసుకోచ్చాడు.
Come what may , what ever the cost , what ever the repercussions, the terrorists of Pelham can not be allowed to get away . These mass murderers have to pay with their lives for their inhuman deeds .
— Javed Akhtar (@Javedakhtarjadu) April 23, 2025