టాలీవుడ్ యాక్టర్ విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జిన్నా (Ginna). ఫన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ తార సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. పాయల్ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా జారు మిటాయా (Jaru mitaya lyrical Song) లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఏ గణేశ్ రాసిన ఈ పాటను సింహా, నిర్మలా రాథోడ్ పాడారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విష్ణు టెంట్ హౌస్ యజమాని జిన్నా పాత్రలో నటిస్తున్నాడు. సన్నీలియోన్ మోడ్రన్ యువతి రోల్లో కనిపించనుంది. జిన్నా చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ-ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు.
విలేజ్ బ్యాక్ డ్రాప్లో కథాంశంతో సాగే ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్టు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Read Also : Dheemthanana Song | అల్లు శిరీష్, అనూ ఎమ్మాన్యుయేల్ ధీంతననా సాంగ్..లిరికల్ వీడియో
Read Also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ హీరోయిన్ ఫైనల్..లుక్ విడుదల
Read Also : Ponniyin Selvan-1 | రజినీకాంత్ సినిమాను దాటి..పొన్నియన్ సెల్వన్-1 సరికొత్త రికార్డు