Peddi | రాంచరణ్ (Ram Charan) లీడ్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ పెద్ది (Peddi). యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి బుచ్చి బాబు టీం నేడు కీలక అప్డేట్ అందించింది.
శ్రీలంకలో సాంగ్ తోపాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం రాంచరణ్, జాన్వీకపూర్ టీం ల్యాండింగ్ అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది టీం. ఈ సందర్భంగా పాపులర్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ రాంచరణ్‌తో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘చరణ్ అన్న ఈ సినిమా కోసం పడుతున్న కష్టం, చేస్తున్న కృషి అద్భుతమైనది. దాని ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు వేచి చూడండి..’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు జానీ మాస్టర్.
పాన్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పెద్ది మార్చి 27న 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
Ravi Teja | క్రేజీ టాక్.. చిరంజీవి డైరెక్టర్‌ను లైన్లో పెట్టిన రవితేజ.. !
Rage Of Kaantha | సెగలు పుట్టించేలా దుల్కర్ సల్మాన్ Rage Of Kaantha ట్రాక్