Janhvi Kapoor | అలనాటి అందాల తార శ్రీదేవి తనయ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు దైవభక్తి ఎక్కువే. ప్రత్యేక సందర్భాలు, ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా తిరుమల (Tirumala)లో వాలిపోతుంటుంది.స్నేహితులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తుంటుంది. ఇవాళ కూడా జాన్వీ వెంకన్నను దర్శించుకుంది.
తన తల్లి శ్రీదేవి 61వ జయంతి నేడు. ఈ సందర్భంగా జాన్వీ వెంకన్న దర్శనానికి వెళ్లింది. సంప్రదాయ చీరకట్టులో స్నేహితుడు శిఖర్ పహారియా (Shikhar Pahariya)తో కలిసి మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న జాన్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’ (Devara) లో నటిస్తోంది. ఈ మూవీతో జాన్వీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో (విలన్‌గా) నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
దీంతోపాటు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న ‘ఆర్సీ16’ లోనూ జాన్వీ నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కి జోడీగా జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలసి ఈ ప్రాజెక్టును నిర్మించనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దనున్నారు మేకర్స్. జాన్వీ ఇంకా ఇవే కాకుండా సూర్యతో కూడా తమిళంలో మరో సినిమా చేయబోతుంది.
Also Read..
Tamil Nadu | ఇదేం పని..? ఫుట్‌బాల్ మ్యాచ్ ఓడిపోయారని విద్యార్థులను చితకబాదిన పీఈటీ టీచర్
Kalki 2898 AD OTT | ‘కల్కి 2898 ఏడీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Bengaluru | బ్రేక్ పెడల్ కిందకు వాటర్ బాటిల్.. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. VIDEO