Janhvi Kapoor | బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sridevi) కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. తక్కువ సమయంలోనే స్టార్ నటిగా పేరు సంపాదించుకుంది. ధడక్ (Dhadak) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. సినిమాలే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ్యక్తిగత, వృత్తి పరమైన అంశాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా జాన్వీ షేర్ చేసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra).. తనకు స్కూటీ నేర్పిస్తున్న (scooty ride) ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ భామ. పింక్ శారీలో ఉన్న జాన్వీకి సిద్ధార్థ్ మల్హోత్ర స్కూటీ పాఠాలు నేర్పించారు. ఈ ఫొటోలను షేర్ చేసిన జాన్వీ కపూర్.. ‘నేను తనని రైడ్‌కి తీసుకెళ్తే పరమ్‌కి చాలా ఇష్టం’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పరమ్ సుందరి’ (Param Sundari). దీనికి తుషార్ జలోటా (Tushar Jalota) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జులై 25న విడుదల కానుంది.
రీసెంట్గా ఎన్టీఆర్ సరసన ‘దేవర’(Devara) మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైన ఈ భామ ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘పెద్ది’(Peddi) సినిమాలో నటిస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో 16వ చిత్రంగా రూపొందుతుంది. కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read..
Actress Rambha | అందుకే సినిమాలకు దూరం అయ్యాను : రంభ
Jwala Gutta | పెళ్లిరోజునే పండంటి పాపకు జన్మనిచ్చిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
Ram Charan | రామ్ చరణ్ ఆతిథ్యానికి ఫిదా అయిన హృతిక్ రోషన్ మాజీ భార్య