Ram Charan | బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన డ్యాన్స్‌తో ఎంతో మంది మనసులని దోచుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి వార్ 2 అనే చిత్రం చేస్తున్నాడు. అయితే హృతిక్ కెరీర్ పరంగా దూసుకుపోతూనే ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం కాస్త డిస్టర్బ్ అయింది. తన భార్యతో వచ్చిన మనస్పర్ధల వలన విడాకులు తీసుకున్నాడు. ఇక హృతిక్ నుండి విడిపోయిన తర్వాత మాజీ భార్య సుసానే ఖాన్ హైదరాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తుండడం ఆసక్తికరంగా మారింది. సుసానే ..షారూఖ్ భార్య గౌరీఖాన్ తో కలిసి పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు వారు తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కి విస్తరించాలని అనుకుంటున్నారు.
హైదరాబాద్ లో మొట్టమొదటి చార్ కోల్ స్టోర్ ని సుసానే ప్రారంభించారు. ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యాడు. అంతేకాదు సుసానే, ఆమె సోదరుడు జాయేద్ ఖాన్ లకు తన ఇంట్లో ఆతిథ్యం కూడా ఇచ్చాడు. దీనికి ఉబ్బితబ్బిబ్బయిన సుసానే, జాయేద్ అతడి ప్రేమ ఆదరాభిమానాలకు పరవశించి రామ్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. రియల్ సూపర్ స్టార్, లెజెండ్ అంటూ చరణ్‌ని ఆకాశానికి ఎత్తారు. కాగా రామ్ చరణ్ ఇటీవల ముంబై సెలబ్రిటీలతో ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తన వ్యాపార కార్యకలాపాలని ముంబైలోను విస్తరించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
అందుకే రామ్ చరణ్ ..హైదరాబాద్ కి విచ్చేసే ముంబై ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడం, వారికి తెలుగు వారి వంటకాల్ని రుచి చూపించి వారి ప్రేమ, ఆప్యాయతలని చూరగొంటున్నాడని అంటున్నారు. చరణ్.. బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ సహా ఎందరో స్టార్లకు వారు ఆతిథ్యం ఇచ్చారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది.