జవహర్‌నగర్, ఆగస్టు 13: అంబేద్కర్‌నగర్ భారత్ పెట్రోల్ బంక్‌లో మోసం చోటుచేసుకుంది. స్విఫ్ట్ డిజైర్ కారులో డీజిల్ పోసుకునేందుకు బుధవారం రాత్రి సందీప్ అనే వినియోగదారుడు వచ్చా డు. కారు ట్యాంక్ పెట్రోల్ సామర్ధ్యం 43 లీటర్లు కాగా… 52లీటర్ల డీజిల్‌ను బంక్ సిబ్బంది పోయడంతో నివ్వెర పడేలా చేసింది.
నాణ్యమైన పెట్రోల్, డిజీల్ పోస్తారనుకుంటే వినియోగదారుల నమ్మకం పోయేలా చేయడం తగదని సందీప్ వాపోయాడు. ఈ ఘటనపై ఉప్పల్ సర్కిల్ సివిల్ సైప్లె అధికారి సంధ్యా సిబ్బందితో కలిసి బంకును పరిశీలించారు. ఈ సందర్భంగా సంధ్యా మాట్లాడుతూ తునికలు, కొలతల్లో ఎలాంటి లోటుపాట్లు లేవని నిర్ధారించారు. పెట్రోల్ బంక్‌లో వసతులు సరిగ్గా లేవని, ఉన్నతాధికారులకు తెలియచేస్తామన్నారు. త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలిపారు.