అంబులెన్స్ ఆలస్యమైతే 10 వేల జరిమానా!
జాతీయ రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనలో జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) 10 నిమిషాల డెడ్‌లైన్‌ను తీసుకొచ్చింది. 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రమాదస్థలికి 10 నిమిషాల్లోపు అంబులెన్స్ చేరుకోవాలని బుధవారం విడుదల చేసిన తన విధాన మార్గ దర్శకాల్లో పేర్కొంది.
- హైవేల్లో 10 కి.మీ పరిధిలో 10 నిమిషాల్లో చేరుకోవాలి
- ప్రమాదాల్లో జాప్యం నివారణకు ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : జాతీయ రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనలో జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) 10 నిమిషాల డెడ్‌లైన్‌ను తీసుకొచ్చింది. 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రమాదస్థలికి 10 నిమిషాల్లోపు అంబులెన్స్ చేరుకోవాలని బుధవారం విడుదల చేసిన తన విధాన మార్గ దర్శకాల్లో పేర్కొంది. ఇలా చేరుకోని పక్షంలో ప్రతి ఘటనలో రూ.10 వేలు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రమాదాల్లో సహాయ టికెట్ అభ్యర్థనను ఆమోదించినప్పటి నుంచి గంట లోపు దగ్గరలోని దవాఖానకు బాధితులను చేర్చాలని సూచించింది. దీన్ని ఉల్లంఘించిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశముందని చెప్పింది.
10 కిలోమీటర్ల పరిధి దాటిన ప్రమాదాల్లో అంబులెన్స్ చేరుకోవాల్సిన సమయం దామషా ప్రకారం పెరుగుతుందని.. ఇది జీపీఎస్ డేటా/ఐఎమ్ఎస్ కేర్ డ్యాష్ బోర్డ్ ద్వారా ధ్రువీకరణ అవుతుందని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ టికెట్‌ను తిరస్కరిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఒప్పందాల్లో భాగంగా పరికరాలు, మందులు, సిబ్బందిని సమకూర్చని సంస్థలకు రూ.10 వేల జరిమానా వేస్తామని తెలియజేసింది. తాజా మార్గదర్శకాలను ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాంతీయ అధికారులు కట్టదిట్టంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే జాతీయ రహదారులపై వివిధ సేవల కోసం 1033 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

