Janhvi Kapoor | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2 ఈ నెల 5న గ్రాండ్‌గా విడుదైలంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాధిలోనూ పెద్ద ఎత్తున థియేటర్స్‌లో మూవీ విడుదలైంది. అయితే, అక్కడ ఎక్కువగా ఉత్తరాధిలో థియేటర్లు కేటాయించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. పుష్ప-2 కారణంగా హాలీవుడ్ మూవీ ఇంటర్స్టెల్లార్ రీ రిలీజ్ వాయిదాపడిందంటూ పలువురు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. క్రిస్టోఫర్ నోలన్ నటించిన ఈ చిత్రం 2014లో విడుదలవగా.. రిలీజై పదేళ్లైన సందర్భంగా మళ్లీ రీ రిలీజ్ చేయాలని భావించారు. ఐమాక్స్‌ల్లో ఎక్కువగా పుష్ప-2 రిలీజ్ కావడంతో ఇక్కడ ఇంటర్స్టెల్లార్ రీ రిలీజ్ వాయిదాపడింది. దాంతో పుష్ప-2కి ఎక్కువ థియేటర్లు ఇచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పోస్టు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కంటపడింది. దీనిపై జాన్వీ కపూర్ స్పందిస్తూ.. హాలీవుడ్ వారంతా భారతీయ సినిమాలను మెచ్చుకుంటున్నారని.. కానీ, మనమే మన చిత్రాలను తక్కువ చేసుకుంటున్నామంటూ మండిపడింది. పుష్ప-2 సైతం ఒక మూవీనేనని.. ఈ సినిమాను మరోదానితో పోలుస్తూ తక్కువ చేయడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించింది.
మీరు ఏ హాలీవుడ్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారో.. వారంతా మన చిత్రాలనే మెచ్చుకుంటుంటే.. మనం మన చిత్రాలను తక్కువ చేసుకుంటూ అవమానించుకుంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి చూసినప్పుడే బాధగా ఉంటుందంటూ జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌లోనూ పుష్ప-2 ర్యాంపేజ్ కొనసాగుతున్నది. తొలిరోజే ఏకంగా రూ.72కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ తొలిరోజు రూ.65.5కోట్లు మాత్రమే రాబట్టింది. మరో వైపు జాన్వీ కపూర్ తెలుగులో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నది. టాలీవుడ్లోకి ‘దేవర’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో జాన్వీ తన అందాలతో అలరించింది. ప్రస్తుతం రాంచరణ్ చిత్రంలో నటిస్తున్నది. ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతున్నది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.