Janhvi Kapoor | బాలీవుడ్లో సూపర్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటారు సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్. ఈ ఇద్దరు ప్రస్తుతం తుషార్ జలోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరమ్ సుందరిలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. కాగా సెట్స్‌లో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్‌కు సంబంధించిన అరుదైన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ముంబైలోని మ్యాడ్‌డాక్ ఫిలిమ్స్ ఆఫీస్‌లోకి వెళ్తున్నపుడు జాన్వీకపూర్ తలపై సిద్దార్థ్ మల్హోత్రా రెండు చేతులు చాచాడు. సిద్దార్థ్ మల్హోత్రా వానలో గొడుగులా జాన్వీకపూర్‌ను తడవకుండా చూసుకున్నట్టుగా ఉన్న స్టిల్ ఇప్పుడు నెటిజన్ల మనసు దోచేస్తుంది. జాన్వీకపూర్ సంప్రదాయ చీరకట్టులో పరమ్ సుందరి షూటింగ్ లొకేషన్లో క్యూట్‌గా నవ్వుతున్న విజువల్స్ కుర్రకారు మనసు దోచేస్తున్నాయి.
నార్తిండియన్ అబ్బాయి, సౌతిండియన్ అమ్మాయి చుట్టూ తిరిగే కల్చరల్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో పరమ్ సుందరి తెరకెక్కుతుంది. ఈ మూవీ జులై 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ దంపతులు మరికొన్ని వారాల్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకునేందుకు రెడీ అవుతున్నారు. కాగా దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ రాంచరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.
We are super excited for this on-screen jodi. #SidharthMalhotra and #JanhviKapoor were clicked during the promotion of their upcoming film #ParamSundari. #FilmfareLens pic.twitter.com/xYIypwYXBu
— Filmfare (@filmfare) June 26, 2025
Ileana | రెండో బిడ్డని పరిచయం చేసిన ఇలియానా.. పేరు కూడా పెట్టేశారుగా..!
The Family Man S3 | ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనౌన్స్మెంట్ టీజర్ వచ్చేసింది
Akhil Akkineni | పెళ్లైన ఇన్ని రోజులకి ఫొటోలు షేర్ చేసిన అఖిల్.. చైతూ, శోభిత ఫొటోలు మిస్