Ileana | రెండో బిడ్డని పరిచయం చేసిన ఇలియానా.. పేరు కూడా పెట్టేశారుగా..!
Ileana | అందాల ముద్దుగుమ్మ ఇలియానా ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అయింది. ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారుని హీటెక్కించిన గోవా బ్యూటీ ఇలియానా, తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె రెండోసారి తల్లి అయింది. ఈ నెల 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
Ileana | అందాల ముద్దుగుమ్మ ఇలియానా ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అయింది. ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారుని హీటెక్కించిన గోవా బ్యూటీ ఇలియానా, తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె రెండోసారి తల్లి అయింది. ఈ నెల 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలియానా తన చిన్నారి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, “మా కుటుంబంలోకి మా రెండో అబ్బాయి కియాను రాఫె డోలన్ కు స్వాగతం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి,” అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
2023 మేలో, ఇలియానా తన ప్రియుడు మైఖేల్ డోలన్‌ని పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో ఈ దంపతులకు మొదటి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ జన్మించాడు. ఇప్పుడు రెండో బిడ్డతో వారి కుటుంబం మరింత పెద్దదైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మొదటి గర్భధారణ సమయంలో బేబీ బంప్ ఫొటోలను తరచూ పంచుకున్న ఇలియానా,రెండో సారి మాత్రం తన గర్భాన్ని గోప్యంగా ఉంచింది. కేవలం మే నెలలోనే “బంప్ బడ్డీస్” అనే క్యాప్షన్‌తో ఒక ఫొటోను మాత్రమే షేర్ చేసి, గర్భవతినని సంకేతం ఇచ్చింది. ఆ తర్వాత నేరుగా పుట్టిన బిడ్డ ఫొటోని అభిమానుల ముందు ఉంచింది.
ఇలియానా జీవితంలో మరో కొత్త అధ్యాయానికి ఈ చిన్నారి తెరలేపినట్టే. ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కియాను రాఫె డోలన్‌కు హృదయపూర్వక స్వాగతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇలియానా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ileana
- Mother
- netigen
- Second baby
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

