The Family Man S3 | ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ గురించి ఓటీటీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు సృష్టించింది. అయితే రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్ సిరీస్‌కి సంబంధించి సీజన్ 3 రాబోతోందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ క్రమంలో, మేకర్స్ తాజాగా సీజన్ 3కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన ఉండబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా వారు టీజర్‌ను పంచుకున్నారు. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ తాను రిలేషన్షిప్ మేనేజర్ అంటూ పరిచయం చేసుకోగా.. పాతాళ్ లోక్ నటుడు జైదీప్ అహ్లవత్ ఇందులో విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం నార్త్ ఈస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది.