Janhvi Kapoor | బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి మృతిని గుర్తు చేసుకుంటూ చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబం ఎదుర్కొన్న బాధలు, అవమానాలను ఇంటర్వ్యూలో వివరించారు. ‘ఒకానొక సమయంలో మా కుటుంబ సభ్యులను మనుషుల్లా కూడా చూడలేదు. మమ్మల్ని ఏదోలా చూశారు. కొందరు మా మీద బురద జల్లాలని ప్రయత్నించారు. ఎవరూ సానుభూతి చూపలేదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీదేవి 2018లో దుబాయిలో చనిపోయిన విషయం తెలిసిందే. అదే సమయంలో జాన్వీ తన తొలి సినిమా ‘ధడక్’కి సిద్ధమవుతోంది. తల్లి మరణవార్త ఇంకా తానూ మానసికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న సమయంలో సినిమా ప్రమోషన్స్, మీడియా ఈవెంట్లకు హాజరుకావాల్సి రావడం తనపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చిందని జాన్వీ ఆవేదన వ్యక్తం చేసింది. ‘అమ్మ మరణం నాకు వ్యక్తిగతంగా ఎంతటి కోపం, బాధ కలిగించిందో.. కొంతమందికి అది ఒక గాసిప్ అయింది. ఓ ఎంటర్టైన్మెంట్ అయింది.
నేను నవ్వితే తప్పు, సైలెంట్‌గా ఉంటే మౌనంగా ఉందని వ్యాఖ్యానించేవారు’ అంటూ మీడియా వ్యవహారశైలిపై జాన్వీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్ తల్లి మృతి తర్వాత నటనా వారసత్వాన్ని కొనసాగిస్తూ.. కష్టపడుతూ తన సినీ ప్రయాణాన్ని జాన్వీ కొనసాగిస్తున్నది. ఇటీవల ‘పరమ్ సుందరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ.. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నది. ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానున్నది. అదే సమయంలో తెలుగులో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా 2026 మార్చి 27న విడుదల కానున్నది.