Homebound | బాలీవుడ్ యాక్టర్లు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘హోమ్‌బౌండ్’(Homebound). నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించాడు.
సెప్టెంబర్ 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ఫుల్ థ్రియాట్రికల్ రన్ తర్వాత మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా ఇక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 21న ప్రీమియర్ కానుంది. మరి ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇంకేంటి థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్సయితే నెట్‌ఫ్లిక్స్‌లో ఓ లుక్కేయండి.
చందన్ కుమార్ (విశాల్ జేత్వా), మహ్మద్ షోయబ్ (ఇషాన్ ఖత్తర్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వీరిద్దరూ మంచి జీవితం కోసం ఆరాటపడుతుంటారు. సమాజంలో వారికి ఎదురయ్యే వివక్షచ పేదరికం నుంచి బయటపడి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో వారి మధ్య స్నేహం, ఆశలు, నిరాశలు, సామాజిక అసమానతలు, వ్యక్తిగత పోరాటాలు వంటి అనేక అంశాల నేపథ్యంలో దర్శకుడు నీరజ్ ఘైవాన్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్ర కూడా కథలో కీలకంగా సాగుతుంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Neeraj Ghaywan’s #Homebound (2025) premieres Nov 21st on #Netflix.#IshaanKhatter #VishalJethwa #JanhviKapoor #ShaliniVatsa pic.twitter.com/E7y81h2LhX
— CinemaRare (@CinemaRareIN) November 16, 2025
Akhanda 2 | నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. 3డీ ఫార్మాట్లో ‘అఖండ 2’
Rajkummar Rao | తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ దంపతులు
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!