Janasena President Pawan Kalyan | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. 1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం కోసం తెలంగాణ మరో రెండు సంవత్సరాలు వేచిచూడవలసి వచ్చింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం సుమారు 60 సంవత్సరాలపాటు ఎదురుచూడవలసి వచ్చింది. సకల జనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపింది. ఇక్కడ గాలిలో.. నేలలో.. నీటిలో.. మాటలో… చివరకు పాటలో సైతం
పోరాట పటిమ తొణికిసలాడుతుంది. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు సదా గుర్తెరగాలి. ప్రజలందరికీ తెలంగాణ పలాలు సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా అందాలి. అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రం అగ్రపథంలో పాలకులు నిలపాలి. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింపచేయాలి. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరులకు నిజమైన నివాళి. ఈ దశాబ్ద వేడుకల సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై తెలంగాణ జై భారత్ అంటూ పవన్ కళ్యాణ్ రాసుకోచ్చాడు.
సకల జనుల విజయం… తెలంగాణ ఆవిర్భావం – JanaSena Chief Shri @PawanKalyan #TelanganaFormationDay pic.twitter.com/m187Brt5lD
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2024