టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) లీడ్ రోల్ చేస్తున్న చిత్రం రిపబ్లిక్ (Republic). దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సీనియర్ యాక్టర్ జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. రిపబ్లిక్ మేకర్స్ తాజాగా జగపతి బాబు (Jagapathi Babu)ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. జగపతిబాబు స్కెచ్ లుక్తో దశరథ్ పాత్ర (జగపతిబాబు రోల్) ను పరిచయం చేశారు. “దీపం పోరాటం చేయడం ఆపినపుడు మాత్రమే చీకటి గెలుస్తుంది” అని పోస్టర్ లో బలమైన సందేశం కనిపిస్తోంది. మేకర్స్ రిలీజ్ చేసిన జగపతిబాబు లుక్ అందరినీ ఆలోచింపజేస్తూ సినిమాపై క్యూరియాసిటీని కలిగిస్తోంది.
జేబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ జీ స్టూడియోస్ అసోసియేషన్ తో జే భగవాన్, జే పుల్లారావు నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల చుట్టూ తిరిగే అంశాలను చూపించబోతున్నట్టు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత దేవా కట్టా పక్కా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రిపబ్లిక్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఐశ్వర్యరాజేశ్ (Aishwarya Rajesh ) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుండగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Introducing @IamJagguBhai garu as #Dasaradh from #REPUBLIC
— BA Raju's Team (@baraju_SuperHit) August 9, 2021
"దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది!"@IamSaiDharamTej @aishu_dil @devakatta @meramyakrishnan #ManiSharma @mynnasukumar @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @ZeeMusicCompany @JBhagavan1 @j_pullarao pic.twitter.com/9kgDgNQhHP
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?