ఫ్యామిలీ హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జగపతిబాబు (Jagapathi Babu)లెజెండ్ సినిమాతో విలన్‌గా సక్సెస్ ఫుల్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో జగ్గూభాయ్‌కి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రజినీకాంత్, మోహన్ లాల్, విజయ్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ లీడింగ్ యాక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రేజీ యాక్టర్ ఇక బాలీవుడ్ (Bollywood)వైపు అడుగేస్తున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆప్ ది ఇండస్ట్రీగా మారింది.
ఇంతకీ ఏ సినిమా అనే కదా మీ డౌటు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తోన్న తాజా చిత్రం కభీ ఈద్ కభీ దివాళి (Kabhi Eid Kabhi Diwali). తాజా అప్ డేట్ ప్రకారం జగపతిబాబు ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్‌ఖాన్ స్వయంగా జగపతిబాబుకు విలన్ ఆఫర్ ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీఫిలింసిటీలో కొనసాగుతుంది. జగ్గూభాయ్ ఈ ఏడాది రాధేశ్యామ్ సినిమాతో నార్తిండియా ప్రేక్షకులకు పలుకరించాడు. అయితే హిందీలో డైరెక్ట్‌గా చేస్తున్న చిత్రం సల్మాన్ఖాన్దే కావడం విశేషం.
ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సారి సల్మాన్ ఖాన్ చేస్తున్న చిత్రం పూజాహెగ్డే, వెంకీ, జగ్గూభాయ్ లాంటి తెలుగు స్టార్లతో వస్తుండటంతో తెలుగు ప్రేక్షకులను చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.