టాలీవుడ్ (Tollywood) నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సింబా..ది ఫారెస్ట్ మ్యాన్ (Simbaa The Forest Man). డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) కథనందించిన ఈ చిత్రానికి మురళీ మనోహర్ రెడ్డి (Murali Manohar Reddy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. అడవి నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కునుందీ చిత్రం. సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కొంతమంది ముఠా సభ్యులు చెట్లను నరికివేసి, వాటిని అక్రమంగా రవాణా చేస్తున్న వీడియోను ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు. అయితే అడవిలో నివసించే వ్యక్తి (హీరో) ఆ స్మగ్లర్లను ఎలాంటి సమాధానమిచ్చాడనే ఇతివృత్తంతో సాగనుంది సింబా. కృష్ణ సౌరభ్ మ్యూజిక్ డైరెక్టర్. రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. తమ్మిరాజ్ ఎడిటింగ్. కృష్ణ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. మరి జగ్గూభాయ్ ఈ చిత్రంతో ఎలా అలరించబోతున్నాడో తెలియాలంటే మరికొంత ఆగాల్సిందే.
జగపతిబాబు ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న మహాసముద్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు. దీంతోపాటు భారీ ప్రాజెక్టులు సలార్, పుష్ప, గనితోపాటు గుడ్ లక్ సఖి, లక్ష్య చిత్రాల్లో నటిస్తున్నాడు.
Here is our #Simbaa
— Sampath Nandi Team Works (@SampathNandi_TW) October 8, 2021
Welcome on board @IamJagguBhai sir#Simbaa-The Forest Man
Written by @IamSampathNandi
Direction by #MuraliManoharReddy
Bankrolled by @SampathNandi_TW and #RajenderReddy #SimbaaOnBoard
More Details rolling 🔜 pic.twitter.com/B2tMwOEeTE
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Seetimaarr | ఓటీటీలో ‘సీటీమార్’ ఈల వేసేది అప్పుడే..!
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Chiranjeevi: కుటుంబంతో కలిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?