టాలీవుడ్ యాక్టర్ ప్రభాస్ (Prabhas ) ప్రస్తుతం సలార్ (Salaar)సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామోజీఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుందట ప్రశాంత్ నీల్ అండ్ టీం. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది.
ఈ క్రేజీ మూవీలో జగపతి బాబు (Jagapathi Babu) కీలక పాత్రలో నటిస్తున్నాడట. అంతేకాదు ఇవాళ్టి షూటింగ్ లో కూడా జాయిన్ అయినట్టు తాజా సమాచారం. ఇప్పటికే పలు భారీ చిత్రాల్లో అలరించిన జగ్గూభాయ్ ప్రభాస్ తో సలార్ లో జాయిన్ అయ్యాడన్న వార్తతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా జగపతిబాబు మరోవైపు బాలకృష్ణతో కలిసి అఖండ సినిమాలో నటిస్తున్నాడు. రజనీకాంత్ నటిస్తోన్న అన్నాత్తేలో కీ రోల్ చేస్తున్నాడు.
లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ట్రాక్ పైకి ఎక్కాడు జగపతిబాబు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్పీడు మీదున్నాడు. నానితో కలిసి టక్ జగదీష్, అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్పలో, సాయిధరమ్ తేజ్ తో రిపబ్లిక్, అజయ్ భూపతి డైరెక్షణ్ లో వస్తున్న మహాసముద్రం, నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న లక్ష్య, వరుణ్ తేజ్ నటిస్తోన్న గని చిత్రాల్లో కీ రోల్స్ చేస్తున్నాడు జగ్గూభాయ్.
ఇవి కూడా చదవండి..
Dhyan chand : త్వరలో ధ్యాన్ చంద్ బయోపిక్
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఎన్ని రకాల వంటలు చేయించాడో చూడండి..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?