మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ (Bollywood) నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)కు సమన్లు జారీ అవడంపై కొంతకాలంగా మీడియా అటెన్షన్ పెరిగిన సంగతి తెలిసిందే. సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య లీనా మారియా మనీలాండరింగ్ కేసు (Money laundering case)లో (Enforcement Directorate) పలు సార్లు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే గత వారం విచారణకు హాజరైంది జాక్వెలిన్.
ఇలాంటి పరిస్థితుల్లో జాక్వెలిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన మోటివేషనల్ పోస్టు ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. జాక్వెలిన్ రెండు సెల్ఫీలు తీసుకొని ఇన్‌స్టాలో పెట్టింది. వీటిలో ఒకటి నవ్వుతూ దిగగా..మరొకటేమో ఫన్నీగా భయపెడుతున్నట్టుగా ఉంది. ఈ రెండు సెల్ఫీలకు ‘నలిగిపోయింది..కానీ దెబ్బతినలేదు’ అంటూ క్యాప్షన్ పెట్టింది. తన ప్రస్తుత పరిస్థితిని చెబుతూ జాక్వెలిన్ పెట్టిన ఫన్నీ పోస్టు హల్ చల్ చేస్తోంది.
ఈడీ కేసులో జాక్వెలిన్ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. భవిష్యతులో జరిపే విచారణకు కూడా ఈడీకీ పూర్తిగా సహకరిస్తానని పేర్కొంది జాక్వెలిన్. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో కలిసి హరిహర వీరమల్లు సినిమా చేస్తోంది జాక్వెలిన్. హిందీలో అక్షయ్ కుమార్‌తో బచ్చన్ పాండేతోపాటు పలు చిత్రాల్లో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం