గురువారం 21 జనవరి 2021
Cinema - Nov 08, 2020 , 16:58:06

బిగ్ బాస్‌లో మరో ట్విస్ట్.. వెక్కివెక్కి ఏడ్చిన జబర్దస్త్ అవినాష్

బిగ్ బాస్‌లో మరో ట్విస్ట్.. వెక్కివెక్కి ఏడ్చిన జబర్దస్త్ అవినాష్

జబర్దస్త్ అవినాష్ అంటే కేరాఫ్ కామెడీ. ఆయనకు నవ్వించడమే కానీ ఏడిపించడం తెలియదు. కానీ అలాంటి కమెడియన్ ఇప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. అది చూసి అంతా షాక్ అయ్యారు. అసలు ఏమై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. బిగ్ బాస్ 4 తెలుగులో ఈ విచిత్రం జరిగింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అవినాష్.. అలా ఏడ్చేసరికి అందరిలోనూ ఒకటే అనుమానం. ఎందుకు ఇంతగా ఈయన ఏడ్చాడు.. నిజంగానే ఏడ్చాడా లేదంటే అది కూడా టాస్క్ లో భాగమా అని ఆసక్తికరంగా మారింది. ప్రోమో చూస్తుంటే మాత్రం నిజంగానే ఏదో జరిగింది అనే విషయం అర్థమైపోతుంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది.. నవ్వుతూ నవ్విస్తూ ఉన్నారు. మధ్యలో సుమ కూడా వచ్చి తనదైన శైలిలో నవ్వించింది. ఈమెను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఏదో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. అంతా బాగానే ఉంది. 

సన్ డే కాస్తా ఫన్ డే అయిపోయింది. కానీ చివర్లో మాత్రం అవినాష్ ఏడుపే అందర్నీ బాధ పెడుతుంది. ప్రతీసారి ఇది కామన్ అయిపోతుంది. సన్ డే ఎపిసోడ్‌లో చాలా విశేషాలున్నాయి. నాగార్జున కూడా కంటెస్టెంట్స్‌తో బాగానే ఆడుకున్నాడు. దివాళీ గిఫ్టులు తీసుకొచ్చిన నాగార్జున.. వాటిని దక్కించుకోడానికి తను చెప్పినట్లు చేయాలని కండీషన్ పెట్టాడు. అందులో భాగంగానే అభిజీత్‌, హారికతో డాన్సులు చేయించాడు. అఖిల్ అదిరిపోయే పాట పాడాడు. ఏమైపోయావే అంటూ మాయ చేసాడు. 

కానీ ఏమైందో ఏమో కానీ చివర్లో అవినాష్ మాత్రం వెక్కి వెక్కి ఏడ్చేసాడు. ఎప్పుడూ నవ్వించే అవినాష్‌కు ఏడిపించే సత్తా కూడా ఉందా లేదా అని తెలుసుకోడానికి అలా టాస్క్ ఇచ్చాడా అనేది చూడాలి. ఈ మధ్య హౌజ్‌లో తన రెండో వైపు కూడా చూపిస్తున్నాడు అవినాష్. అప్పటి వరకు నవ్వుతూనే ఉన్నా.. మరోవైపు కోపంగా కూడా మాట్లాడుతున్నాడు అవినాష్. ఈయనలో ఈ సైడ్ చూడటం చాలా మందికి కొత్త. ఇప్పుడేమో ఏకంగా ఏడ్చేసి అందర్నీ ఆలోచనలో పడేసాడు


logo