‘ఎత్తు అనేది పెద్ద సమస్యేం కాదు. అదే సమస్య అనుకుంటే రష్మిక నేషనల్ క్రష్ అయ్యేదా? నిత్యామీనన్ ఇంతమందికి అభిమాన నటిగా ఎదిగేదా?’ అంటూ అంతెత్తు లేచించి తమిళ అందం ఇవానా. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ‘మన హీరోల్లో ఎక్కువమంది టాల్ బాయ్సే కదా! మీరేమో షార్ట్.. ఇబ్బంది కాదా? అని ఓ విలేకరి అడగ్గా ఆమె పై విధంగా స్పందించారు.
ఇంకా చెబుతూ ‘హీరో ఎంత హైట్ ఉన్నా మేనేజ్ చేయగల కెపాసిటీ నాకుంది. నటికి టాలెంట్ ముఖ్యం. హావభావాలతో, అందంతో మెప్పించడం ముఖ్యం. తెరపై ఎత్తును ఎవరూ చూడరు. ఎవర్ని ఎలా చూపించాలనేది డీవోపి చేతిలో ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీకి నన్ను హైట్‌గా చూపించడం పెద్ద పనేం కాదు. ఆరడుగుల హీరో పక్కన కూడా నటించి మెప్పించగల సామర్థ్యం నాకుంది.’
అంటూ చెప్పుకొచ్చింది ఇవానా. ‘లవ్‌టుడే’ సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాలభామ.. రీసెంట్గా ‘సింగిల్’ సినిమాతో తెలుగులో నేరుగా విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన సినిమాలో కథానాయికగా ఇవానా ఎంపికైనట్టు వార్తలొస్తున్నాయి.