The Paradise | టాలీవుడ్ స్టార్ యాక్టర్ నాని (Nani) అభిమానులతోపాటు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ (THE PARADISE). దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు, తనికెళ్లభరణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన నాని, మోహన్ బాబు పోస్టర్లు, గ్లింప్స్ తోపాటు టీజర్ సినిమాపై హైప్ పెంచేస్తున్నాయి. ది ప్యారడైజ్‌పై ఇప్పటికే రెండు రిలీజ్ డేట్స్‌లో మార్పులు చేశారని తెలిసిందే. ఫైనల్‌గా సెప్టెంబర్ 24న 2026 గ్రాండ్‌గా విడుదల కానుంది.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కతున్న ఈ సినిమా విడుదలకు ఇంకో నెల మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో నాని టీం ఇక ప్రమోషనల్ ప్లాన్‌తో బిజీగా మారబోతుందన్న వార్త మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. కీర్తి సురేశ్‌పై వచ్చే స్పెషల్ సాంగ్ త్వరలో విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ లాంచ్‌తో ప్రమోషనల్ ప్లాన్ మొదలు కానుందని ఇన్సైడ్ టాక్. తెలుగుతోపాటు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానున్నఈ మూవీలో నాని నయా అవతార్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని రషెష్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. మొత్తానికి త్వరలోనే నాని టీం ప్రమోషన్స్ షురూ కాబోతున్నాయన్న వార్త మూవీ లవర్స్‌ను ఎక్జయిటింగ్‌కు గురి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ జాగా మనదే.. అంటూ గూస్బంప్స్ తెప్పించే డైలాగ్‌తో షురూ అయిన ది ప్యారడైజ్ టీజర్లో మే ప్యారే ప్యారడైజ్ వాసియో అంటూ మోహన్ బాబు స్టైలిష్ ఎంట్రీ ఇవ్వగా.. సర్కార్ ఉన్నది ఈ దొరల కోసమా..? జనం కోసమా..? అంటూ సాగే సంభాషణలు.. మరోవైపు చీ అని చీదరించుకునే నలుపురంగే మన జెండా.. కాకే దాని మీద గుర్తు అంటూ..నాని ఓ జాతికి నాయకత్వం వహించే నాయకుడిగా అదిరిపోయే యాక్టింగ్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని టీజర్ చెప్పకనే చెబుతోంది.
ది ప్యారడైజ్‌లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి సోనాలి కులకర్ణి కీ రోల్లో నటిస్తుండగా.. కిల్ ఫేం రాఘవ్ జుయల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.