Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Keerthy Suresh | మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘డోరతీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు ‘అక్క’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు. రాధిక ఆప్టేతో కలిసి నటించిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది
Keerthy Suresh | మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘డోరతీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు ‘అక్క’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు. రాధిక ఆప్టేతో కలిసి నటించిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇది కీర్తి సురేష్ కెరీర్లో తొలి వెబ్ సిరీస్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె బయటపెట్టారు. తన భర్త ఆంటోని థట్టిల్తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు తనను ఇబ్బంది పెట్టినట్లు కీర్తి వెల్లడించారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండి, సెల్ఫీ కావాలంటూ పదేపదే ఒత్తిడి చేశాడని చెప్పారు. వేచి ఉండమని చెప్పినా వినిపించుకోకుండా వెంటనే ఫొటో దిగాలని పట్టుబట్టడంతో తాము అసౌకర్యానికి గురయ్యామని వివరించారు.
ఈ ఘటన గురించి కీర్తి మాట్లాడుతూ.. “నేను, నా భర్త ఆంటోని కలిసి మిలాన్ నుంచి భారత్‌కు విమానంలో వస్తున్నాం. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను సెల్ఫీ అడిగాడు. అయితే అతడు మద్యం మత్తులో ఉన్నాడు. సరిగా నిలబడలేని పరిస్థితిలో కనిపించాడు. కాసేపు వేచి ఉండమని చెప్పినా వినిపించుకోకుండా ఇప్పుడే సెల్ఫీ కావాలని ఒత్తిడి చేశాడు. నేను ఎప్పుడు ఫొటో దిగాలన్నది మీరు నిర్ణయించకూడదని అతడికి స్పష్టంగా చెప్పాను. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. నా భర్త కూడా అతడిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకపోవడంతో విమాన సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది” అని తెలిపారు.
అభిమానులు తనను కలవడం, మాట్లాడటం, ఫొటోలు దిగడం తనకు ఎప్పుడూ ఇష్టమేనని కీర్తి చెప్పారు. అయితే అభిమానమనే పేరుతో వ్యక్తిగత హద్దులు దాటి ప్రవర్తించడం మాత్రం ఇబ్బందికరమని ఆమె అభిప్రాయపడ్డారు. కొందరు అభిమానులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారని, సెల్ఫీ అడగకుండానే తనతో సరదాగా మాట్లాడి వెళ్లిపోతారని చెప్పారు. అలాంటి అభిమానుల తీరు తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. అభిమానాన్ని వ్యక్తం చేయడంలోనూ ఎదుటివారి వ్యక్తిగత స్వేచ్ఛను, పరిస్థితిని గౌరవించాలని ఆమె మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాలో సీనియర్ హీరో వెంకటేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి ‘రౌడీ జనార్ధన’ అనే పాన్ ఇండియా చిత్రంలోనూ కనిపించనున్నారు.వీటితో పాటు ‘సత్యన్ సావిత్రి’, ‘కన్నెవీడి’, ‘తొట్టం’, ‘రాఫ్తార్’ వంటి మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

