Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ ఎలా ఉండేది? తెరపైకి వచ్చేసరికి ఎలాంటి మార్పులు జరిగాయి? అనే విషయాలను వెల్లడించారు. కార్తీక్ సుబ్బరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఆయన మొదట రాసిన ‘గేమ్ ఛేంజర్’ కథ ఓ ఐఏఎస్ అధికారి చుట్టూ తిరుగుతుంది.
రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఓ అధికారి చేసే ప్రయత్నాలే కథలో ప్రధానాంశం. కఠినమైన రాజకీయ పరిస్థితుల మధ్య ఎన్నికల అధికారిగా పనిచేసే వ్యక్తి ఎదుర్కొనే సవాళ్లను వాస్తవిక కోణంలో చూపించాలని భావించారు. ఈ కథకు హిందీ చిత్రం ‘న్యూటన్’ నుంచి కొంత స్ఫూర్తి పొందినట్లు కూడా కార్తీక్ తెలిపారు. ఈ కథను శంకర్‌కు వినిపించగా ఆయనకు నచ్చిందని, స్క్రీన్‌ప్లే కూడా రాయాలని కోరినట్లు కార్తీక్ చెప్పారు. అయితే అప్పట్లో ‘మహాన్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటంతో స్క్రీన్‌ప్లే బాధ్యతలు చేపట్టలేకపోయారు. దీంతో కథను మాత్రమే అందించారు. తాను రాసిన కథలో ఓ గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన అంశం కూడా ఉందని కార్తీక్ వెల్లడించారు. అయితే శంకర్ ఈ కథను మరింత యాక్షన్ ప్రధానంగా రూపొందించాలని భావించారు. మధురై నేపథ్యానికి చెందిన గ్యాంగ్‌స్టర్ పాత్రను జోడించి, కథకు తమిళ ప్రాంతీయ నేపథ్యాన్ని తీసుకొచ్చారు. దీంతో తాను అనుకున్న వాస్తవిక రాజకీయ కథకు, తెరపై రూపొందిన చిత్రానికి మధ్య గణనీయమైన తేడా వచ్చిందని కార్తీక్ వివరించారు.
రామ్ చరణ్ వంటి స్టార్ హీరో, శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్‌తో సినిమా చేస్తున్నప్పుడు కథ స్వరూపం మారుతుందని తనకు అర్థమైందని ఆయన చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత చూసినప్పుడు అసలు తాను రాసిన కథకు, ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథకు మధ్య ఉన్న మార్పులు స్పష్టంగా అర్థమయ్యాయని తెలిపారు.అయినప్పటికీ శంకర్ వంటి ప్రముఖ దర్శకుడు తన కథను సినిమాగా తెరకెక్కించడం సంతోషంగా ఉందని కార్తీక్ సుబ్బరాజు పేర్కొన్నారు. తన అసలు ఆలోచనకు తుది రూపానికి మధ్య తేడాలు ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

