Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Murder | బిడ్డ అతిగా ఫోన్ మాట్లాడుతోందని, తాను చెప్పిన మాట వినడం లేదని ఓ తల్లి ఆమెను దారుణంగా గొంతుపిసికి చంపేసింది. ఈ ఘటన షాద్‌నగర్ ఏరియాలోగల కొత్తూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. షాద్‌నగర్ డీసీపీ శిరీష వెల్లడించిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని హనుమాన్ కాలనీలో నివాసం ఉండే ఆటోడ్రైవర్ ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు.
Murder : బిడ్డ అతిగా ఫోన్ మాట్లాడుతోందని, తాను చెప్పిన మాట వినడం లేదని ఓ తల్లి ఆమెను దారుణంగా గొంతుపిసికి చంపేసింది. ఈ ఘటన షాద్‌నగర్ ఏరియాలోగల కొత్తూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. షాద్‌నగర్ డీసీపీ శిరీష వెల్లడించిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలోని హనుమాన్ కాలనీలో నివాసం ఉండే ఆటోడ్రైవర్ ముయ్యడి రాజు, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె సువర్చల (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
ముయ్యడి రాజు భార్య కల్లుకు బానిసైంది. ఈ క్రమంలో కల్లు తాగవద్దన్న కుమార్తె సువర్చలతో నిత్యం గొడవ పడేది. ఈ నెల 27న సాయంత్రం మరోమారు వీరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి కుమార్తెను గొంతుపిసికి చంపేసింది. అనంతరం ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాలిక మెడకు చీర చుట్టింది. తర్వాత భర్తకు ఫోన్ చేసి రప్పించింది. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇటీవలే బాలిక పుష్పవతి కావడంతో కడుపునొప్పి భరించలేక బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని తండ్రి రాజు భావించాడు. అయితే రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు బాలిక కడుపునొప్పితో కాదు, ఊపిరాడక చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో తెలిసింది. దాంతో వారు తల్లిని అనుమానించి తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో నిందితురాలు నేరం అంగీకరించింది. ఫోన్ అతిగా మాట్లాడుతోందని, చెప్పిన మాట వినట్లేదని, అందుకే చంపేశానని చెప్పింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

