Pushpa 2 The Rule | అల్లు అర్జున్ (Allu Arjun) - సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) . కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. డిసెంబర్ 5 తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ సర్కిల్ టాక్ ప్రకారం పుష్ప 2 వసూళ్లు రూ.1300 కోట్లు దాటాయి.
హౌస్ఫుల్ షోలతో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోలా సినిమా సాగుతూ నిర్మాతల కాసులు తెచ్చిపెడుతోంది. కాగా థియేటర్లలో సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇక ఓటీటీలో సందడి చేసే టైం కూడా వచ్చేసిందంటూ ఓ గాసిప్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.. పుష్ప 2 ది రూల్ 2025 జనవరి 9న నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ కానుందన్న వార్త వైరల్ అవుతోంది.
అయితే దీనిపై మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ తేదీనే వస్తుందా..? లేదంటే వేరే డేట్ను ఫిక్స్ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Laila | ఎంటర్టైనింగ్ బ్లాస్ట్.. లైలాగా విశ్వక్సేన్ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్
Nani | ట్రెండింగ్లో నాని నయా లుక్.. ఇంతకీ ఏ సినిమా కోసమో..?
Manchu Mohan Babu | మోహన్ బాబుకు ఈ నెల 24 వరకు సమయం ఇచ్చాం: రాచకొండ సీపీ