Dil Raju | ఐటీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో సోదాలు కొనసాగిస్తున్నారని తెలిసిందే. నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసాలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుతోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు.
మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి ఇండ్లలోనూ.. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని వార్తలు వచ్చాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరుగడం లేదన్నారు. ఇండస్ట్రీ మొత్తం ఐటీ దాడులు కొనసాగుతున్నాయని ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఐటీ అధికారులు మంగళవారం హైదరాబాద్‌లోని 8 చోట్ల ఏకకాలంలో 55 బృందాలు దాడులు చేపట్టాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
వారిసు వసూళ్లు రూ.120 కోట్లు మాత్రమే..
సినిమాలకు పెట్టుబడులు.. వచ్చిన ఆదాయం ఇతర అంశాలపై దిల్ రాజును ప్రశ్నించగా… తాను విజయ్‌తో తెరకెక్కించిన వారిసు (వారసుడు) సినిమా రూ.120 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు విజయ్‌కు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చాం. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు సమాచారం.
ఇప్పటికే ఐటీ అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు, ఆదాయాలపై ఆరాతీస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.
బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం..
సోదాల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజు భార్య తేజస్వినిని బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై తేజస్విని మాట్లాడుతూ.. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు.
Sukumar | పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
Dil Raju | విజయ్ వారిసు కలెక్షన్లు రూ.120 కోట్లే.. ఐటీ అధికారులతో దిల్ రాజు.. ?