దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్ (Janhvi Kapoor). ఓ వైపు గ్లామరస్ పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉంది. ఈ భామ లీడ్ రోల్లో నటించిన చిత్రం మిలి (Mili). మలయాళ చిత్రం హెలెన్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.
సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో మథుకుట్టీ జావియర్ (Mathukutty Xavier) డైరెక్ట్ చేస్తున్న మిలీ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేసింది. మీడియాతో చిట్‌చాట్‌లో ఆసక్తికర కామెంట్ చేసి, మూవీ లవర్స్ కు ఓ క్రేజీ న్యూస్ అందించింది జాన్వీకపూర్. ఇంతకీ ఆ విషయమేంటనుకుంటున్నారా..? అదేనండి జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి.
ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ వార్తలు ఇండస్ట్రీ సర్కిల్ లో రౌండప్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చిత్రం గురించి రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘లెజెండ్, ఐకాన్, ఆయనతో కలిసి పనిచేయడం నా కల’అంటూ రిప్లై ఇచ్చింది.
ఈ సమాధానంతో జాన్వీకపూర్ త్వరలోనే తారక్‌తో సినిమా చేయడం పక్కా అని తెలిసిపోతుంది. మరి కొరటాల శివ-తారక్ సినిమాతోనేనా..? లేదంటే..? వేరే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా..? అనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.
Read Also: Idhe Idhe lyrical song | తగ్గేదే లే నుంచి ఇదే ఇదే నే రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్
Read Also: Anu Emmanuel |Nivetha Thomas | మీ ప్రేమాభినాలకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని.. నివేదా థామస్
Read Also: Avatar-2 Trailer | విజువల్ వండర్ అవతార్ 2 ట్రైలర్ వచ్చేసింది..వీడియో