తిరుమల: సెప్టెంబర్ 4వ తేదీన జీఎస్ఎల్వీ-ఎఫ్17(GSLV-F17) రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ కేటగిరీలో ఇది 19వ రాకెట్ కావడం విశేషం. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని తీసుకెళ్లనున్నారు. జియో ప్లాట్‌ఫామ్‌పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం ఈఓఎస్-05 అని నారాయణన్ తెలిపారు.
VIDEO | Tirumala, Andhra Pradesh: ISRO chief V Narayanan visits Tirumala temple ahead of the launch of Advanced Earth Observation Satellite-05 aboard GSLV-F17 on September 4.
(Full video available on PTI Videos – https://t.co/d8jp61yd2p) pic.twitter.com/crFKHKqJUu
— Press Trust of India (@PTI_News) September 2, 2026
సబ్-జీటీవో కక్ష్యలోకి ఈఓఎస్-05 శాటిలైట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17ను ప్రయోగించనున్నారు. దీని పేలోడ్ ఫేరింగ్ 4 మీ డయామీటర్లు ఓగీవ్గా పేర్కొన్నారు. ఈఓఎస్-05 అనేది ఎర్త్ అబ్జర్వేషన్ స్పేస్‌క్రాఫ్ట్. దీని ద్వారా భూమిను పరిశీలించనున్నారు. జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఈ శాటిలైట్ ఇమేజ్‌లను తీస్తుంటుంది.
GSLV-F17 carrying EOS-05 was moved from the Vehicle Assembly Building (VAB) to the Umbilical Tower (UT) on 28th August 2026 at Satish Dhawan Space Centre, SHAR, Sriharikota, as preparations continue for the scheduled launch on:
🗓️ 04 Sept 2026 | ⏰ 02:55 AM IST
Livestreaming… pic.twitter.com/4nW2MUgeYh
— ISRO (@isro) September 1, 2026