Ramarao on duty in OTT | రవితేజ సినిమా ఓటీటీలో రావడం ఏంటి.. దానికి ఆయన ఒప్పుకోడు కదా.. రెండేండ్ల కింద క్రాక్ సినిమాకు మంచి ఆఫర్ వచ్చినప్పుడు.. మొన్నటికి మొన్న ఖిలాడి సినిమాకు 40 కోట్ల ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆయన వద్దన్నాడు. అలాంటి రవితేజ తన సినిమాను ఎందుకు డిజిటల్ మీడియాలో విడుదల చేస్తాడు అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఈయన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నారు. దాంతో పాటు మరో మూడు సినిమాలు కూడా లైన్లో పెట్టాడు మాస్ రాజా. అన్నింటికంటే ముందు రామారావు సినిమా విడుదల కానుంది.
దీన్ని ముందుగా మార్చి 25న విడుదల చేయాలని అనుకున్నారు.. కానీ అదే రోజు రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో వస్తుండటంతో తన సినిమాను వాయిదా వేసుకున్నాడు రవితేజ. కానీ ఆ తర్వాత ఒక్క డేట్ కూడా ఖాళీ లేదు. జూన్ వరకు వరుస సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఎక్కువ రోజులు హోల్డ్ చేస్తే అనవసరంగా బడ్జెట్ పెరుగుతుంది అని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే దీన్ని ఓటీటీకి ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఒక పోస్టర్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది.
స్ట్రీమింగ్ పార్టనర్ సోనీ లీవ్ అంటూ పోస్టర్ విడుదల చేశారు రామారావు ఆన్ డ్యూటీ దర్శక నిర్మాతలు. అంటే సినిమాను నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల చేస్తున్నట్లుగా చెప్పకనే చెప్పారు. శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రాజీష విజయన్ హీరోయిన్స్‌గా నటించారు. ఒకవేళ ఈ సినిమా నిజంగానే నేరుగా ఓటీటీలో విడుదలైతే రవితేజ కెరీర్లో ఇదే మొదటి సినిమా అవుతుంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. అన్నట్లు ఈ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేశాడు దర్శకుడు శరత్.
Follow Us : Google News, Facebook, Twitter, Instagram, Youtube
DJ Tillu in OTT | డీజే టిల్లు ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. మరీ ఇంత త్వరగానా..?
ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్ రివ్యూ.. శర్వానంద్ గట్టిగానే కొట్టేలా ఉన్నాడే..!
Bheemla Nayak | భీమ్లా నాయక్ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి వెళ్లనుంది..?
రాధేశ్యామ్ సినిమా కోసం రంగంలోకి దిగిన స్టార్ హీరోలు
Ramarao on duty in OTT