DJ Tillu On Aha OTT | కరోనా తర్వాత ఈ మధ్య కాలంలో బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో డిజే టిల్లు ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన డీజే టిల్లు సినిమాకు మొదటి రోజు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో ఖిలాడి లాంటి పెద్ద సినిమా బరిలో ఉన్నా కూడా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు డీజే టిల్లు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. కేవలం రూ.8 కోట్ల బిజినెస్ చేసిన డీజే టిల్లు ఇప్పటికే 7 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. సినిమా కొనుక్కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ లాభాల్లోకి వచ్చాడు. డీజే టిల్లు సినిమాకు రూ.8.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు ఇది చాలా ఎక్కువ కానీ ఈ సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. ఇప్పుడు వాళ్ల నమ్మకం నిజమైంది.. లాభాల పంట పండుతుంది. రెండవ వారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే తీసుకొచ్చింది.
ఇప్పుడు కూడా భీమ్లా నాయక్ సినిమాకు టికెట్స్ దొరకని వాళ్లకు మంచి ఆప్షన్ అయిపోయింది డీజే టిల్లు. పైగా రెండూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన సినిమాలే కావడం గమనార్హం. భీమ్లా నాయక్ సినిమా కోసం చాలా వరకు డీజే టిల్లు నుంచి థియేటర్స్ తీసుకున్నారు. ఉన్న కొన్ని స్క్రీన్స్‌లోనే ఇప్పుడు ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకొస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా డీజే టిల్లు ఓటీటీ రిలీజ్ డేట్ ( DJ Tillu OTT Release Date ) కన్ఫార్మ్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ( OTT ) సంస్థ ఆహా ( Aha )మంచి రేట్ ఇచ్చి ఈ సినిమాను తీసుకుంది. తాజాగా ఈ సినిమాను మార్చి 4 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది ఆహా టీమ్. థియేటర్స్‌లో టిల్లు కామెడీ మిస్ అయిన వాళ్లు ఇప్పుడు హాయిగా ఇంట్లోనే కూర్చుని చూడొచ్చన్నమాట.
Follow Us : Google News, Facebook, Twitter, Instagram, Youtube
బాలకృష్ణ Unstoppable సీజన్ 2 గురించి అదిరిపోయే న్యూస్.. ఈసారి చిరంజీవి కూడా..”
పుట్టు మచ్చల గురించి అడగటం ఆయన విజ్ఞతకే వదిలేశాను : నేహాశెట్టి”
ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..”