DJ Tillu | రొమాన్స్ హద్దులు దాటలేదు.. డీజే టిల్లు సినిమాలోని సీన్లపై ఓపెన్ అయిన డైరెక్టర్ విమల్ కృష్ణ
DJ Tillu Director Vimal Krishna | సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా రూపొందిన కొత్త సినిమా ‘డిజె టిల్లు’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ, ఫార్చూన్ ఫోర్ మూవీస్ తో కలిసి నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘డిజె టిల్లు’ సినిమా ఈ నెల 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సందర్భంగా విమల్‌కృష్ణ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు..
ఇదే సరైన సినిమా
కొత్త దర్శకుడిగా చిత్ర పరిశ్రమలోకి రావాలనుకున్నప్పుడు రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమానే సరైనది అనిపించింది. ఎందుకంటే ఈ తరహా చిత్రాలతో త్వరగా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లొచ్చు. తక్కువ సమయంలో ఆకర్షించగలం. అందుకే విభిన్న కథలు నా దగ్గర ఉన్నా, ఈ నేపథ్యాన్నే ఎంచుకుని ‘డిజె టిలు’్ల తెరకెక్కించాం. హీరో సిద్ధు నాకు పదేళ్లుగా తెలుసు. లాక్ డౌన్ ముందు ఈ కథ అనుకుని సిద్ధూకు చెబితే వెంటనే చేద్దామని ముందుకొచ్చాడు. అప్పటికే నిర్మాత నాగవంశీ సిద్ధూ కలిసి సినిమా చేయాలనుకున్నారు కాబట్టి మా సినిమాకు వెంటనే అంగీకారం తెలిపారు.
సందేశాలిస్తే చూడరు
ట్రైలర్ లో ఒక అమ్మాయి కొందరు మగవాళ్లతో మాట్లాడినట్లు చూపించాం. వాళ్లు ఆమెకు సోదరులు కావొచ్చు, స్నేహితులు కావొచ్చు. కానీ సమాజం చూసే దృక్కోణం వేరుగా ఉంటుంది. మేము సందేశం చెప్పడం లేదు. అలా చూపిస్తే ఎవరూ సినిమా చూడరు. వినోదాత్మకంగా నవ్విస్తూ తెరకెక్కిస్తే సినిమాపై ఆసక్తి చూపిస్తారు. ‘డిజె టిల్లు’లో మేమదే చేశాం. రొమాంటిక్ హద్దులు దాటకుండా, సకుటుంబంగా సినిమా చూసేలా రూపొందించాం. నేను మా అమ్మానాన్నతో సినిమా చూసేలా చేయాలనుకున్నాను.
టిల్లు పాత్రకు దగ్గరగా
హీరో సిద్ధూ టిల్లు పాత్రకు చాలా దగ్గరి వ్యక్తిత్వం ఉన్నవాడు. అతను హైదరాబాద్ కుర్రాడు. అతని హావభావాలు, మాట్లాడే తీరు, తరహా అంతా డిజె టిల్లు పోలికలతో ఉంటుంది. అందుకే ఈ పాత్రకు సిద్ధూ టైలర్ మేడ్ లా అనిపిస్తున్నాడు. నిర్మాత నాగవంశీ చాలా సహకారం అందించారు. ‘డిజె టిల్లు’ ట్రైలర్ చూశాక కొందరు నిర్మాతలు సంప్రదించారు. త్వరలో కొత్త ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తా.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
“DJ Tillu | టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన డీజే టిల్లు.. సిద్ధూ ఏం చేస్తాడో?”
పుట్టు మచ్చల గురించి అడగటం ఆయన విజ్ఞతకే వదిలేశాను : నేహాశెట్టి
మా స్టోరీస్ మావే..రైటర్స్ గా యంగ్ హీరోలు
ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..
Neha Shetty | గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్న నేహా శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

