DJ Tillu | టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన డీజే టిల్లు.. సిద్ధూ ఏం చేస్తాడో?
DJ Tillu | సాధారణంగా ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ఆయన నటించిన తర్వాత సినిమాపై కూడా అంచనాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ నడిచేది హిట్ అనే ఇంధనంపై కాబట్టి. ఇక్కడ హిట్స్ ఎవరెక్కువ ఇస్తే.. వాళ్ల బండి అంత వేగంగా నడుస్తుందని అర్థం. వాళ్లను అందుకోడానికి రేసు నడుస్తూనే ఉంటుంది. ఈ రేసులో అప్పుడప్పుడూ కొత్త హీరోలు కూడా తామున్నామని గుర్తు చేస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతంగా తమ టాలెంట్ నమ్ముకుని వస్తుంటారు కొందరు కుర్రాళ్లు. అలా వచ్చిన హీరో సిద్ధూ జొన్నలగడ్డ. ఇప్పటికే కారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా చాలా సినిమాలు చేశాడు సిద్ధూ. ఈయనెవరో ఇంకా గుర్తు రాలేదంటే ఒక్కసారి గుంటూరు టాకీస్ సినిమాలో రష్మి గౌతమ్‌తో రొమాన్స్ చేసిన కుర్రాడ్ని గుర్తు చేసుకోండి.. సరిపోతుంది. ఆయనే ఈ సిద్ధూ.
గుంటూరు టాకీస్ తర్వాత కల్కి సినిమాలోనూ మంచి పాత్రే చేశాడు సిద్ధూ జొన్నలగడ్డ. కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో రైటర్‌గానూ మారి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం ఆహా వేదికగా నేరుగా విడుదలైంది. కరోనా టైమ్‌లో వచ్చిన ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. అయితే ఆ వెంటనే చేసిన మా వింత గాథ వినుమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఈయనే రైటర్‌గా మారి చేసిన సినిమా డీజే టిల్లు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా డిజే టిల్లు టైటిల్ సాంగ్ ఇప్పుడు మార్మోగిపోతుంది. రామ్ మరియాల పాడిన పాటకు రెస్పాన్స్ అదిరిపోయింది. నేహా శెట్టి అందాలు.. సిద్ధూ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు అన్ని సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ప్రస్తుతం ట్రైలర్ కూడా యూ ట్యూబ్‌లో అదరగొడుతుంది.
ఫిబ్రవరి 12న డీజే టిల్లు విడుదల కానుంది. పైగా విడుదలకు ముందే ఈ చిత్రాన్ని ఔట్ రేటెడ్‌గా అమ్మేశారు. టేబుల్ ప్రాఫిట్స్తోనే డీజే టిల్లు అమ్ముడైంది. కచ్చితంగా సినిమా నవ్వించి నవ్వించి చంపేస్తుందంటున్నాడు సిద్ధూ. ఫిబ్రవరి 11న రవితేజ ఖిలాడి వస్తున్నా కూడా వెనక్కి తగ్గేదే లేదంటున్నాడు ఈయన. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన డీజే టిల్లు థియేటర్స్‌లో కూడా అదే స్థాయిలో మోత మోగిస్తాడో లేదో చూడాలి.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
పుట్టు మచ్చల గురించి అడగటం ఆయన విజ్ఞతకే వదిలేశాను : నేహాశెట్టి
మా స్టోరీస్ మావే..రైటర్స్ గా యంగ్ హీరోలు
ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..
Neha Shetty | గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్న నేహా శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

