Radhe shyam | ప్రభాస్ కొత్త సినిమా రాధే శ్యామ్ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార హీట్ పెరుగుతోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రానికి వాయిస్ ఓవర్స్ ప్పేందుకు ఆయా భాషల స్టార్స్ రంగంలోకి దిగారు. తెలుగులో మహేశ్ బాబు రాధే శ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తాడని మొదట అనుకున్నా.. అది ఎస్ఎస్ రాజమౌళి దగ్గరకు వెళ్లింది. హిందీలో అమితాబ్ బచ్చన్ నెరేషన్ ఇస్తున్నాడు. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, కన్నడలో శివరాజ్ కుమార్ ఈ ప్రేమకథకు తమ ముందుమాట చెప్పబోతున్నారు.
మార్చి 11.. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అంతా ఎదురుచూస్తున్న రోజు. ఆ రోజే రాధేశ్యామ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగుతో సహా దక్షిణాది భాషలకు ఒక వెర్షన్‌గా, హిందీకి ఒక వెర్షన్‌గా, ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం ఇంగ్లిష్‌లో మరో వెర్షన్‌గా రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల కాబోతుంది. ఆయా ప్రాంతాల నేటివిటీకి అనుగాణంగా పాటలను రీషూట్ కూడా చేశారు. సినిమా స్థాయికి తగినట్లే దేశవ్యాప్తంగా నాలుగైదు చోట్ల ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నారు మేకర్స్. ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా ఇలాగే వివిధ ప్రధాన నగరాల్లో భారీగా ఈవెంట్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
పీరియాడిక్ ప్రేమకథగా వస్తున్న రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ క్యారెక్టర్లో పూజా హెగ్డే కనిపించనుంది. ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ నుంచి ఇటీవల విడుదలైన ఈ రాతలే సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.