Raviteja | తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన కథానాయకుడు రవితేజ. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 30 ఏండ్లు దాటిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా ఎదగడానికి దాదాపు 12 సంవత్సరాల సమయం పట్టింది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో హీరోగా మొదటి సారి విజయం అందుకున్న రవితేజ.. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, భద్ర, విక్రమార్కుడు లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా మాస్ రాజాగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆ మధ్య వరుస పరాజయాలు పలకరించినా కూడా గతేడాది క్రాక్ సూపర్ హిట్ కావడంతో మళ్లీ బిజీ అయిపోయాడు మాస్ రాజా.
ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. జూన్ 17న రామారావు ఆన్ డ్యూటీ.. ఇదే ఏడాది దసరాకు ధమాకా.. వచ్చే ఏడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు విడుదల చేయబోతున్నాడు. ఇంత బిజీగా ఉన్న రవితేజ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం హీరోగానే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని దర్శకులకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే చిరంజీవి, బాబీ సినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు. మరోవైపు బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కూడా రవితేజ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు మాస్ రాజా. మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు ఈ సీనియర్ హీరో.
Ravi Teja | స్పీడుమీదున్న రవితేజ.. అప్పుడే మరో సినిమాను మొదలు పెట్టేశాడు?”
“Balakrishna-Raviteja | బాలకృష్ణ-రవితేజ మల్టీస్టారర్..?”
“Vikramarkudu | ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌కు నో చెప్పిన రాజమౌళి?”