Raviteja Remunaration | చిరు సినిమాకు రవితేజ భారీ పారితోషికం.. కేవలం 25రోజులకే అంత తీసుకోనున్నాడా?
ప్రస్తుతం సినిమాల తీసేవిధానం మారిపోయింది. దాంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది. హీరోలు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ల విషయంలో రాజీ పడటం లేదు. ఒక సినిమా హిట్టయితే చాలు పారితోషికాన్ని రెట్టింపు చేస్తున్నారు.
Raviteja Remunaration | ప్రస్తుతం సినిమాల తీసేవిధానం మారిపోయింది. దాంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ఇంతకు ముందు లాగా బడ్జెట్‌ను లెక్కలు వేసుకుని అంతే బడ్జెట్లో సినిమాలు రూపొందించాంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. సినిమా బడ్జెట్ మొదట అనుకున్నదానికంటే రెట్టింపు అవుతుంది. నిర్మాతలు కూడా మంచి కథ ఉంటే ఎంతైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులతోనే వాళ్ళు పెట్టిన బడ్జెట్ వచ్చేస్తుంది. ఇక థియేటర్లో విడుదలైన తర్వాత వచ్చేవన్ని లాభాలే. అదే విధంగా హీరోలు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ల విషయంలో రాజీ పడటం లేదు. ఒక సినిమా హిట్టయితే చాలు పారితోషికాన్ని రెట్టింపు చేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో కూడా పారితోషికాన్ని రెట్టింపు చేశాడు.
ఆ స్టార్ హీరో ఎవరో కాదు మాస్రాజ రవితేజ. ప్రస్తుతం ఈయన వరుస సనిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో రవితేజ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్లు గతం నుంచే ప్రచారం అవుతుంది. తాజాగా ఈ చిత్రం కోసం రవితేజ తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేఎస్ రవింద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ చిత్రానికి రవితేజ 10కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. ఈ చిత్రం కోసం రవితేజ ఇంత మొత్తం డిమాండ్ చేయడానికి కారణం షూటింగ్‌కు 20 నుంచి 25 రోజుల వరకు డైట్లను కేటాయించడమేనని సమాచారం. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్‌తో రవితేజ తన రెమ్యునరేషన్ 10కోట్ల నుంచి 18కోట్లకు పెంచాడని టాక్
‘అన్నయ్య’ సినిమా తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటించడంతో సినిమాపైన ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవికి 154వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తుంది. వైజాగ్ షిప్ హార్బర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందట. చిరు ఈ చిత్రంలో అండర్ కవర్ కాప్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇక శృతి కూడా ఈ చిత్రానికి 2కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకుందని సమాచారం. ప్రస్తుతం చిరంజీవి నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాలశివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

